: నచ్చకపోతే పార్టీని వదిలెయ్: చిదంబరం తనయుడికి దిగ్విజయ్ సూచన

స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్ హైకమాండ్ పై విమర్శలు గుప్పించిన మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం తనయుడు కార్తీకి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సలహా ఇచ్చారు. హైకమాండ్ విధివిధానాలు నచ్చకపోతే పార్టీని వదిలేయాలని సూచించారు. తమది అన్ని వర్గాలను కలుపుకుని పోయే పార్టీ అని, ఈ సిద్ధాంతంతో విభేదించే వారు వెళ్లిపోవచ్చని కార్తీ పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అంతకుముందు, కార్తీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తమిళనాడు శాఖకు మరింత స్వయం నిర్ణయాధికారం ఉండాలని, నిర్ణయాలన్నీ ఢిల్లీ నుంచి కాకుండా, ఇక్కడి వ్యవహారాలపై తామే నిర్ణయం తీసుకునే విధానం ఉండాలని పేర్కొన్నారు.

More Telugu News