: టీడీపీని దెబ్బతీయడం ఎవరి తరం కాదు: చంద్రబాబు
తెలంగాణలో టీడీపీ పునాదులు చాలా గట్టివని... చరిత్ర ఉన్నంతవరకు టీడీపీని దెబ్బతీయడం ఎవరి తరం కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. టీడీపీతో ఎవరైనా పెట్టుకుంటే వారే దెబ్బతింటారని హెచ్చరించారు. దేశంలో ఏ పార్టీకి కూడా లేని విధంగా నిబద్ధత కలిగిన కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని... ప్రాణాలను సైతం పణంగా పెట్టి వారంతా పార్టీ శ్రేయస్సు కోసం పని చేస్తున్నారని అన్నారు. కార్యకర్తలు చనిపోతే వారి పిల్లలకు చదువులు చెప్పించే బాధ్యతను పార్టీ తీసుకుంటుందని వెల్లడించారు. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే వినూత్న పథకాలకు నాంది పలికింది టీడీపీనే అని చెప్పారు. సేవా కార్యక్రమాలకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ అని అన్నారు.