: పురుషుల వాలీబాల్ మ్యాచ్ కు వెళ్లిందని మహిళకు ఏడాది జైలు

ఇరాన్ లో మహిళలపై ఆంక్షలు ఎంత దారుణంగా ఉంటాయో తెలిపే సంఘటన ఇది. ఘోంచే ఘవామి అనే ఇరానియన్-బ్రిటీష్ మహిళ టెహ్రాన్ లో జరిగిన ఇరాన్-ఇటలీ పురుషుల వాలీబాల్ మ్యాచ్ కు హాజరయ్యేందుకు ప్రయత్నించింది. అంతేగాకుండా, పురుషుల క్రీడాపోటీలకు ఇరాన్ మహిళలు ధైర్యంగా వెళ్లగలగాలని పిలుపునిచ్చింది. అక్కడ పురుషుల మ్యాచ్ లకు మహిళలు హాజరవరాదన్న ఆంక్షలున్నాయి. ఘటన జూన్ లో జరగ్గా... ఘవామిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. అప్పటి నుంచి ఆమె జైల్లోనే మగ్గుతోంది. ఆమెను వెంటనే విడుదల చేయాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తో పాటు పలు సంస్థలు ఎలుగెత్తాయి. తాజాగా, ఈ వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయస్థానం ఘవామికి ఏడాది జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై ఇరాన్ లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News