సాహసాలు చేయాలనుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది: పాక్ కు భారత్ హెచ్చరిక
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాహసాలు చేయాలనుకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది: పాక్ కు భారత్ హెచ్చరిక

సరిహద్దుల్లో పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ కు భారత్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. సాహసాలు చేయాలనుకుంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని... భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. "మా చేతుల్లో డాలు మాత్రమే కాదు... కత్తులు కూడా ఉన్నాయి... బీ కేర్ ఫుల్" అంటూ జైట్లీ డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటిదాకా పాక్ దాడి చేసిన ప్రతిసారీ రక్షణాత్మక ధోరణితో వ్యవహరించామని... ఇకపై ఎదురు దాడి చేస్తామని హెచ్చరించారు. సరిహద్దులో శాంతి నెలకొనేందుకు ఏం చేసినా తనకు అభ్యంతరం లేదని ఇప్పటికే భారత సైన్యానికి ప్రధాని మోదీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News