నేడు ఏపీలో పర్యటించనున్న మోడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు ఏపీలో పర్యటించనున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆంధ్రప్రదేశ్ లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రెండు గంటల సేపు ఆయన పర్యటన కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 1.15 గంటలకు విశాఖ నుంచి ఆయన ఏరియల్ సర్వే మొదలవుతుంది. ఏరియల్ సర్వే అనంతరం, విశాఖలో ఏర్పాటు చేసిన తుపాను ఛాయాచిత్ర ప్రదర్శనలో పాల్గొంటారు. ఈ ప్రదర్శన కోసం సుమారు 100 ఫొటోలను హైదరాబాదులో ప్రింట్ వేయించి వైజాగ్ పంపించారు. తాను తుపాను పరిస్థితి గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తెలుసుకుంటున్నానని నిన్న మోడీ తెలిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా, హుదూద్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చంద్రబాబు కోరనున్నారు. నష్టపోయిన పంటలు, నివాస గృహాలు, మౌలిక వసతులు, సమాచార, విద్యుత్, రవాణా వ్యవస్థల గురించి మోడీకి వివరించనున్నారు. తక్షణ సాయంగా రూ. 2 వేల కోట్లను అందించాలని ఇప్పటికే కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఒడిశాలో కూడా ప్రధాని మోడీ ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.

More Telugu News