: నేను బాగానే ఉన్నా, ఆందోళన అవసరం లేదు: కమల్ హాసన్

తన ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రముఖ నటుడు కమల్ హాసన్ తెలిపారు. కలుషిత ఆహారం తీసుకోవడం వల్లే అస్వస్ధతకు గురయ్యానని, అంతకంటే ఏమీలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆసుపత్రి నుంచి ఓ మీడియా సంస్థతో ఫోన్ లో మాట్లాడిన కమల్, "చాలామంది ఈ విషయాన్ని డ్రామా చేయాలనుకుంటారు. వారిని నిరుత్సాహపరుస్తున్నందుకు సారీ. నేను బాగానే ఉన్నా. కేవలం ఫుడ్ పాయిజనింగ్ జరిగిందంతే. అంతకుమించి మరే లేదు" అని వివరించాడు. 'పాపనాశం' చిత్రం కోసం కేరళ మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోందని, అక్కడ సరైన హోటల్స్ లేకపోవడంతో రోడ్డు పక్కనే ఉన్న దాబాల్లో తిన్నామనీ అన్నారు. బహుశా కలుషిత నీరు తాగడం వల్ల ఇలా జరిగి ఉంటుందని కమల్ పేర్కొన్నాడు.

More Telugu News