: కోతి చనిపోయిందని ఏం చేశారో చూడండి!

మధ్యప్రదేశ్ లోని దకాచ్యా గ్రామంలో ఇటీవలే ఓ కోతి చనిపోయింది. కొన్ని చోట్ల అది పెద్ద విషయమేమీకాదు. కానీ, ఈ గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు. తమకు ఏదో అరిష్టం చుట్టుకుంటుందని భావించి ఈ కోతికి భారీస్థాయిలో అంత్యక్రియలు జరిపారు. 6000 మంది వరకు జనాభా ఉన్న ఈ గ్రామంలో ఓ వానర జంట ఉండేది. ఓ రోజు వాటిని కుక్కలు తరమగా, వాటిలో ఒకటి నీటితో నిండిన కందకంలో పడిపోయిందని, తర్వాతి రోజు దాన్ని వెలికితీశామని గ్రామ సర్పంచ్ రమేశ్ జీ తెలిపారు. ఊళ్ళో కోతి చనిపోతే నష్టదాయకమని, కోతి హనుమంతుడి ప్రతిరూపమని గ్రామపెద్దలు చెప్పడంతో వెంటనే ఆ కోతికి అంత్యక్రియలు జరపాలని నిర్ణయించారు. అందుకోసం రూ.1.5 లక్షలు ఖర్చు చేశారు. ఈ క్రతువుకు 2000 మంది హాజరయ్యారట. 200 మంది యువకులు శిరోముండనం చేయించుకున్నారట కూడా.

More Telugu News