: 500వ టెస్టు ఆడుతున్న విండీస్
వెస్టిండీస్ జట్టు 500వ టెస్టు ఆడుతోంది. నేడు బంగ్లాదేశ్ తో ఆరంభమైన రెండో టెస్టు ద్వారా కరీబియన్ టీం ఈ ఘనత నమోదు చేసింది. గ్రాస్ ఐలెట్ లో జరుగుతున్న ఈ చారిత్రక మ్యాచ్ లో గెలిచి సంబరాలు చేసుకోవాలని విండీస్ భావిస్తోంది. 1928లో విండీస్ తొలి టెస్టు ఆడింది. కాగా, చరిత్రలో ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు మాత్రమే 500 టెస్టులు పూర్తి చేసుకున్నాయి. తాజాగా విండీస్ కూడా వాటి సరసన చేరింది. ఫాస్ట్ బౌలర్ల అండతో 80, 90వ దశకాల్లో ప్రపంచ క్రికెట్ ను శాసించిన వెస్టిండీస్ జట్టు, క్రమేణా ఆ ప్రాభవాన్ని కోల్పోయింది.