: మహిళలకు కీలక పదవులిచ్చిన ఘనత బాబుదే: ఏపీ మంత్రి పరిటాల సునీత
సర్కారులో మహిళలకు కీలక పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే చెందుతుందని ఏపీ పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సునీతతో పాటు, మరో మంత్రి పీతల సుజాతను టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక, సుజాత మాట్లాడుతూ, 84 ఇసుక రీచ్ లను మహిళా సంఘాలకు అప్పగిస్తామని తెలిపారు.