: ప్లేబోయ్ వద్దంటూ బీజేవైఎం వీరంగం... టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు

హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న నొవాటెల్ హోటల్ లో ప్లేబోయ్ క్లబ్ ఏర్పాటును బీజేవైఎం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. భారతీయ సంస్కృతిని నాశనం చేసే ప్లేబోయ్ క్లబ్బును ఏర్పాటు చేయనీయమని తీవ్రంగా హెచ్చరించింది. ఈ క్రమంలో నిన్న రాత్రి ప్లేబోయ్ క్లబ్బును ఏర్పాటు చేస్తున్న నొవాటెల్ హోటల్ లో బీజేవైఎం కార్యకర్తలు అలజడి సృష్టించారు. ఒక్కొక్కరుగా హోటల్ లోకి ప్రవేశించిన బీజేవైఎం కార్యకర్తలు ప్లేబోయ్ ఏర్పాటుకు, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో బౌన్సర్లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రిసెప్షన్ కౌంటర్ వద్ద ఉన్న ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహిస్తోందంటూ బీజేవైఎం కార్యకర్తలు మండిపడ్డారు. దేశంలోని ఏ ఇతర నగరంలో ప్లేబోయ్ క్లబ్బుకి అనుమతి ఇవ్వలేదని... కేవలం కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అనుమతి మంజూరు చేసిందని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి... బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News