: కేసీఆర్ ను మించిన నియంత ఎవరూ లేరు: కిషన్ రెడ్డి

కేసీఆర్ పై తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత కూడా ఉద్యమనాయకుడిలానే కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఏదైనా విషయం మీద అభ్యంతరాలుంటే ప్రధానమంత్రితో అధికారికంగా మాట్లాడాలని... నోటికొచ్చినట్లు బయట మాట్లాడకూడదని అన్నారు. ప్రతీదాన్ని రాద్ధాంతం చేస్తే తెలంగాణ అభివృద్ధి ఎలా జరుగుతుందని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోడీని కేసీఆర్ నియంత అనడాన్ని తప్పుబట్టారు. ప్రస్తుత రాజకీయాలలో కేసీఆర్ ను మించిన నియంత ఎవరూ లేరని ఆయన అన్నారు. గవర్నర్ కు ప్రత్యేక అధికారాల అంశం... యుపీఏ సర్కారే విభజన బిల్లులో పొందుపరిచిందని... దాంతో మోడీకి ఏం సంబంధమని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

More Telugu News