: తిరుమలకు పోటెత్తిన భక్తులు
కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం రోజున తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 26 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం, కాలినడకన వచ్చే భక్తుల దివ్య దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. రేపు ఎల్లుండి శని, ఆదివారాలు కావడంతో భక్తుల రద్దీ మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది.