: చంద్రబాబు విజయవాడ, విశాఖ పర్యటన ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వారంలో విజయవాడతో బాటు, విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 7వ తేదీన విజయవాడ, 8,9 తేదీల్లో విశాఖ జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు. ప్రతి వారం ఓ జిల్లాలో పర్యటించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. గత వారం జరగాల్సిన విశాఖ జిల్లా పర్యటన వాయిదా పడటంతో... ఈ వారం విశాఖ జిల్లాలో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.

More Telugu News