: ఇది బీరు విచిత్రం... తాగకపోయినా 24 గంటలూ హ్యాంగోవరే

మాథ్యూ హాగ్ అనే ఆస్ట్రేలియన్ శరీరమే ఒక పెద్ద బీర్ ఫ్యాక్టరీ అట. అతని శరీరంలో కొన్ని మార్పులే బీరు తయారీకి కారణమవుతున్నాయి. అదెలాగో చూడండి... ఆటోఫెర్మంటేషన్ సిండ్రోమ్ బారిన పడడంతో హాగ్ పేగులలో ‘ఈస్ట్’ బ్యాక్టీరియా చిక్కుకుపోయింది. దీని కారణంగా అతను బార్లీ, బ్రెడ్ లాంటివి తింటే, అవి ఈస్ట్‌తో కలిసి బీరు ఉత్పత్తవుతోందట. అక్కడేమో అన్నం అప్పుడప్పుడు తింటారు. రొట్టె తిననిదే పూట గడవదు... అందువల్ల తాగకపోయినా హ్యాగ్ 24 గంటలూ హ్యాంగోవర్‌లోనే ఉంటున్నాడట పాపం

More Telugu News