: అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలు స్వాధీనం!
కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలను గుంటూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రోజువారి తనిఖీల్లో భాగంగా గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరు వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల నగదును పోలీసులు గుర్తించారు. నగదుపై వాహనదారును పోలీసులు ప్రశ్నించగా సరైన సమాధానం కరవైంది. దీంతో పోలీసులు నగదు స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కారు సీజ్ చేశారు.