: సిమెంటు ధరలు తగ్గించే ప్రసక్తే లేదు: సిమెంటు కంపెనీల యాజమాన్యాలు


ఆకాశాన్నంటుతున్న సిమెంట్ ధరలతో భవన నిర్మాణాల ఖర్చు తడిసి మోపెడవుతోన్న సంగతి తెలిసిందే. అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న సిమెంటు ధరలతో నిర్మాణరంగం కుదేలవుతోంది. ధరలను నియంత్రించేలా సిమెంట్ కంపెనీలపై ఒత్తిడి తీసుకురావాలంటూ ప్రభుత్వాలకు కూడా వినతులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో సిమెంట్ కంపెనీల యాజమాన్యాలు స్పందించాయి. సిమెంట్ ధరలను ఎట్టి పరిస్థితుల్లోను తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. గత మూడేళ్ల నుంచి తాము నష్టాల్లో ఉన్నామని తెలిపాయి. విద్యుత్, రవాణా చార్జీలు పెరిగినందునే తాము కూడా ధరలను పెంచామని చెప్పాయి. అయితే పెరిగిన ధరల పాపమంతా తమదే కాదని... ఇందులో ప్రభుత్వానికి కూడా వాటా ఉందని చెప్పుకొచ్చాయి. ధరల పెంపులో 80 శాతం అధికారం ప్రభుత్వానిదే అని తేల్చి చెప్పాయి.

  • Loading...

More Telugu News