కో ఆపరేటివ్ ట్రిబ్యునల్ కోర్టులో అశోక్ బాబుకు ఎదురుదెబ్బ
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబుకు కో ఆపరేటివ్ ట్రిబ్యునల్ కోర్టులో చుక్కెదురైంది. గోపన్ పల్లిలోని ఏపీఎన్జీవో హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఆయనకు అర్హత లేదని ట్రిబ్యునల్ తెలిపింది. ఈ మేరకు సొసైటీలో ఆయన సభ్యత్వం చెల్లదని తేల్చి చెప్పింది.