ఏపీకు ప్రత్యేక హోదా విషయంలో ఆందోళన అవసరం లేదు: వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అర్హత లేదంటూ నిన్న (శుక్రువారం) ప్రణాళిక సంఘం సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈ రోజు విశాఖలో స్పందించారు. ఈ మేరకు అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ, ఏపీకు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. తెలుగు ప్రజలందరికీ తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పారు.