: దేశవ్యాప్తంగా ముగిసిన 7వ విడత ఎన్నికలు

దేశవ్యాప్తంగా ఏడో విడత ఎన్నికలు ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వివిధ రాష్ట్రాల్లో ఓటింగ్ కొనసాగింది. చెదురుమదురు సంఘటనలు మినహా ఏడో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నరేంద్ర మోడీ, అద్వానీ, రాజ్ నాథ్ సింగ్, చంద్రబాబు నాయుడు వంటి జాతీయ స్థాయి నేతలు, సైనానెహ్వాల్, ఛటేశ్వర్ పూజారా వంటి క్రీడాకారులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, తెలంగాణ ఎన్నికల్లో చిరంజీవి, కేసీఆర్ సహా పవన్ కల్యాణ్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

More Telugu News