: ఆదిలాబాదులో యువ డాక్టర్లు పరుగులు పెట్టారు!

అవును, ఆదిలాబాదులో వైద్య విద్యను అభ్యసిస్తున్న వారంతా పరుగులు పెట్టారు. అయితే, ఈ పరుగు భయంతోనో, ఆందోళనతోనో పెట్టింది కాదు... ఆరోగ్యం కోసమే సుమా! నడక, పరుగు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకే తాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని వైద్య విద్యార్థులు తెలిపారు. వీరంతా రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) విద్యార్థులు. వారితో పాటు రిమ్స్ డాక్టర్లు, అధ్యాపకులు కూడా ఈ పరుగులో పాల్గొన్నారు. ఆదిలాబాదులో ఇవాళ ఉదయం ‘2కె రన్’ నిర్వహించారు. కళాశాల నుంచి ప్రారంభమైన ఈ పరుగు ఇందిరా స్టేడియం వరకు కొనసాగింది.

More Telugu News