: ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
జమ్మూకాశ్మీర్ లో భారత సైనికులకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. అయితే, ఈ కాల్పుల్లో మన ఆర్మీ మేజర్ కూడా మృతి చెందారు. అంతేకాకుండా, మరో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, పోలింగ్ అధికారి హత్యకు కారకులుగా భావిస్తున్న ముగ్గురు తీవ్రవాదులు షోపియన్ జిల్లాలోని ఓ ఇంట్లో తలదాచుకున్నారన్న సమాచారంతో సైన్యం దాడి చేసింది. దీంతో, నిన్న అర్ధరాత్రి నుంచి ఈ ఉదయం వరకు సైన్యం, తీవ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగాయి.