: లోక్ సభ ఐదో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
పన్నెండు రాష్ట్రాల్లోని 121 లోక్ సభ స్థానాలకు ఈ రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. కర్ణాటకలో 28, రాజస్థాన్ లో 20, మహారాష్ట్రలో 19, ఉత్తరప్రదేశ్ లో 11, ఒడిశాలో 11, మధ్యప్రదేశ్ లో 10, బీహార్ లో 7, జార్ఖండ్ లో 6, పశ్చిమ బెంగాల్ లో 4, చత్తీస్ గఢ్ లో 3, జమ్మూకాశ్మీర్ లో 1, మణిపూర్ లో 1, లోక్ సభ స్థానాలకు ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 16.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 121 స్థానాలకు, 1769 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.