: అక్క లక్ష్మణ రేఖ దాటింది: వరుణ్ గాంధీ
తన సోదరి ప్రియాంక గాంధీ లక్ష్మణ రేఖ దాటిందని బీజేపీ నేత వరుణ్ గాంధీ అభిప్రాయపడ్డారు. సుల్తాన్ పూర్ లో ఆయన మాట్లాడుతూ, అక్క హుందాతనం వీడిందని అన్నారు. కుటుంబ సభ్యుడిగా, రాజకీయ నాయకుడిగా తాను ఎలాంటి అమర్యాదకర వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తనకు స్వలాభం కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన అన్నారు. తాను ఎన్నుకున్న బాట మంచిదేనని తన అక్కకు వరుణ్ తెలిపారు. తాను ఇదే బాటలో నడుస్తానని ఆమెకు చెప్పారు. ప్రియాంకా గాంధీ గత వారం తన తమ్ముడు దారి తప్పాడని, దారిలో పెట్టాలని చిన్నమ్మ మేనకకు విజ్ఞప్తి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఈ సమాధానం చెప్పాడు.