: రేపు సాయంత్రం నుంచి చంద్రబాబు 3డీ ప్రచారం
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ మేరకు సీమాంధ్రలో 3డీ ప్రచారాన్ని ఉపయోగించబోతున్నారు. రేపు సాయంత్రం నుంచి బాబు తన 3డీ ప్రచారం చేయనున్నారు. దీని ద్వారా సీమాంధ్రలో మొత్తం 20 చోట్ల బాబు ప్రసంగం ప్రసారం అవుతుంది.