: తెలంగాణ కాంగ్రెస్ నేతలను చూస్తే సిగ్గేస్తోంది: కేకే
తెలంగాణ కాంగ్రెస్ నేతలను చూస్తుంటే సిగ్గేస్తోందని టీఆర్ఎస్ నేత కేకే అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, తెలంగాణ ప్రజలే సాధించుకున్నారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఒక్క పైసా కూడా ఇవ్వనని కిరణ్ కుమార్ రెడ్డి అంటే, తెలంగాణ నేతలు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఒక్క తెలంగాణ విద్యార్థికైనా తెలంగాణ నేతలు బెయిల్ ఇప్పించారా? అని ఆయన నిలదీశారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి ప్రాణాలిస్తానన్న నేత ఎవరైనా ఉన్నారా? అని కేకే విరుచుకుపడ్డారు. ఒక్క రోజు కూడా జై తెలంగాణ అనని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాత్రం తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.