: కాంగ్రెస్ చేతక్ లాంటిది... బీజేపీ స్ప్లెండర్ లాంటిది: రాహుల్ బజాజ్
బజాజ్ ఆటో మేనేజింగ్ డైరక్టర్ రాహుల్ బజాజ్ దేశ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్, బీజేపీలను ద్విచక్రవాహనాలతో పోల్చారు. కాంగ్రెస్ చేతక్ లాంటిదని, బీజేపీ హీరో స్ప్లెండర్ లాంటిదని అభివర్ణించారు. చేతక్ ఒకప్పుడు గొప్పగా వెలిగినా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని తెలిపారు. స్ప్లెండర్ లానే బీజేపీ కూడా మెరుగ్గా కనిపిస్తోందంటూనే చురకలేశారు. అది కూడా ఆ తానులో గుడ్డేనని సూత్రీకరించారు. పాలనా పటిమపరంగా రెండూరెండేనని రాహుల్ బజాజ్ అభిప్రాయపడ్డారు. అప్పట్లో స్ప్లెండర్ రంగప్రవేశంతో చేతక్ ప్రాభవం తగ్గిపోయిన సంగతి తెలిసిందే.
ఇక, రాకెట్ వేగంతో దూసుకువచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీని పల్సర్ తో పోల్చారు. ఆ పార్టీ స్పష్టమైన విధానంతో తనకంటూ ఓ స్థానం సృష్టించుకుందని చెప్పారు. 'ఆమ్ ఆద్మీ'ని ఇష్టపడొచ్చు, లేక, ద్వేషించవచ్చు... కానీ, విస్మరించలేమని ఈ పారిశ్రామికవేత్త వివరించారు.