: సీమాంధ్రకు జరిగింది అన్యాయమే: యనమల
రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు అన్యాయమే జరిగిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. తునిలో ఆయన మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన అప్పులు పంచిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, సీమాంధ్రకు ఆస్తులు సరిగా పంచలేదని అరోపించారు. సీమాంధ్ర ప్రాంతానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని జైరాం రమేష్ చెప్పడం హస్యాస్పదం అని అన్నారు. యూపీఏ ప్రభుత్వం సీమాంధ్ర ప్రజలను మభ్య పెడుతోందని ఆయన మండిపడ్డారు.