: తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వారి ఆకాంక్ష నెరవేరుతోంది: రాపోలు ఆనంద భాస్కర్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ రాజ్యసభలో ప్రసంగించారు. 60 ఏళ్ల నుంచి తెలంగాణ కావాలని ఉద్యమిస్తున్న వారి ఆకాంక్ష నెరవేరే సమయం ఆసన్నమైందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన సోనియాగాంధీని తెలంగాణ తల్లిగా ఆరాధిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో సుష్మాస్వరాజ్ పాత్ర మరువలేనిదని రాపోలు చెప్పారు. అలాగే, ఆది నుంచి తెలంగాణకు అండగా నిలబడిన మాయావతికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.