: ఆ మూడు పోర్టళ్ళలో మా ఉత్పత్తులు కొనవద్దు: లెనోవో హెచ్చరిక
ఆన్ లైన్ షాపింగ్ పోర్టళ్ళు ఫ్లిప్ కార్ట్, అమెజాన్, స్నాప్ డీల్ లు తమ ఉత్పత్తులకు అధీకృత విక్రేతలు కాదని చైనా టెక్నో జెయింట్ లెనోవో వెల్లడించింది. ఈ మేరకు వినియోగదారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. గత కొన్ని నెలలుగా ఈ మూడు పోర్టళ్ళు అనుమతి లేకుండానే తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయన్న విషయం తమ దృష్టికి వచ్చినట్టు లెనోవో పేర్కొంది. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్, అమెజాన్ ద్వారా కొనుగోలు చేసే ఉపకరణాలకు లెనోవో బాధ్యత వహించదని స్పష్టం చేసింది. కాగా, దీనిపై స్నాప్ డీల్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానిస్తూ, తమ సైట్లో అందుబాటులో ఉన్న లెనోవో, తోషిబా ఉత్పత్తులన్నీ సదరు కంపెనీల వారంటీ సహితమని చెప్పారు.