: సత్తాలేని వాళ్లను ఇంటికి సాగనంపుతాం: ఇన్ఫోసిస్ చైర్మన్ మూర్తి
తగిన పనితీరును చూపలేకున్న వారికి పింక్ స్లిప్ లు ఇచ్చి ఇంటికి సాగనంపేందుకు ఇన్ఫోసిస్ సిద్ధమవుతోంది. గతేడాది జూన్ లో ఇన్ఫోసిస్ చైర్మన్ గా నారాయణమూర్తి తిరిగి బాధ్యతలు చేపట్టాక, కంపెనీని వృద్ధి బాటలో నడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనలిస్టుల సమవేశంలో మూర్తి మాట్లాడుతూ.. అధిక వేతనాలపై నియమితులై సరైన పనితీరు చూపని వారిని వెళ్లిపోవాల్సిందిగా కోరతామని చెప్పారు. అత్యధిక వేతనాలు తీసుకుంటూ కంపెనీ ఆశించిన మేర పనితీరు చూపని వారు.. మరో చోట పని చూసుకోవచ్చని సూచించారు. కంపెనీలో ఉత్పాదకత సామర్థ్యాన్ని పెంచడానికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు మూర్తి వివరించారు.