: ఓటేస్తే వోల్వో బస్సు ఇస్తానని నేననలేదు: జేసీ

కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేగా మారిన జేసీ దివాకర్ రెడ్డి రాజ్యసభకు పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనకు టీఆర్ఎస్ నేతలు ఓటు వేస్తే వోల్వో బస్సు ఇస్తానని కేటీఆర్ తో అన్నారంటూ వస్తున్న వార్తలు హస్తం పార్టీలో కలకలం సృష్టించాయి. దానికి వివరణ ఇచ్చిన జేసీ.. తను వోల్వో బస్సు ఇస్తానని అనలేదన్నారు. తనకు ఓటేస్తారా? అని టీఆర్ఎస్ నేతలను శాసనసభ లాబీలో అడిగానని, అందుకు కేటీఆర్ 'వోల్వో బస్సు ఇస్తారా?' అని అడిగాడని చెప్పారు. దానికి తను(జేసీ).. 'వై నాట్?' అని సరదాగా బదులిచ్చానని తెలిపారు. అంతకుముందు జేసీకి మద్దతిస్తున్నారన్న సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేస్తానని పీసీసీ చీఫ్ బొత్స సత్యానారాయణ హెచ్చరిక కూడా జారీ చేశారు.

More Telugu News