: అశోక్ బాబుకు ఓయూ పోలీసుల నోటీసులు
ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబుకు ఓయూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24లోగా తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రసంగాలు చేశారంటూ బద్దం నరసింహారెడ్డి అనే వ్యక్తి అశోక్ బాబుపై ఆరోపణలు చేశారు. ఆ స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన పోలీసులు తదుపరి చర్యలు తీసుకున్నారు.