: టెన్షన్ పడితే స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఎక్కువే

దైనందిన జీవితంలో మీరు ప్రతి విషయానికి టెన్షన్ పడుతున్నారా?... అయితే, స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయంటున్నారు పరిశోధకులు. అవును, ఆలోచనలతో సతమతమయ్యేవారికి అనారోగ్యం కూడా త్వరగానే వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో 25 నుంచి 74 సంవత్సరాల మధ్య వయసున్న వారిపై అధ్యయనం చేశారు.

నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే పేరిట సుమారు ఏడు వేల మంది ఆలోచనా తీరును అంచనా వేశారు. వారికి రక్త పరీక్షలు చేయడంతో పాటు ఒత్తిడి స్థాయిలనూ పరిశీలించారు. ఒత్తిడి ఎక్కువగా ఉన్న వారిలో స్ట్రోక్ వచ్చే ఛాన్స్ 33 శాతం అధికమని ఈ సర్వేలో తేల్చి చెప్పారు. ప్రతి మనిషికి మానసిక ఒత్తిడి ఉంటుందని, అయితే, ఎక్కువగా ఉంటేనే ప్రమాదమని పరిశోధకులు చెబుతున్నారు.

More Telugu News