ధనవంతుల జాబితా నుంచి సోనియా పేరు తొలగింపు!
ప్రపంచంలో అధికారంలో ఉన్న ధనిక రాజకీయ నేతల జాబితా నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పేరును 'హఫింగ్ టన్ పోస్ట్' తొలగించింది. ఈ మేరకు తన వెబ్ సైట్ లో తెలిపింది. థర్డ్ పార్టీ వెబ్ సైట్ జాబితా ఆధారంగా సోనియా పేరును ఈ జాబితాలో చేర్చినట్లు వెబ్ సైట్ ఎడిటర్ పేర్కొన్నారు. అయితే, సోనియా ఆస్తుల మొత్తం గురించి ధృవీకరించేందుకు తమ ఎడిటర్లకు సాధ్యం కాలేదని, అందుకే జాబితా నుంచి పేరును తొలగిస్తున్నట్లు వివరించారు. ఏది ఏమైనా దీనిపై చింతిస్తున్నామని తెలిపారు. ఇరవైమందితో రూపొందించిన జాబితాలో రెండు బిలియన్ డాలర్లతో సోనియా 12వ స్థానంలో ఉన్నారని హఫింగ్ టన్ పోస్ట్ ఓ కథనంలో వెల్లడించింది.