రచ్చబండను అడ్డుకుంటే అంతు చూస్తాం: జగ్గారెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రచ్చబండను అడ్డుకుంటే అంతు చూస్తాం: జగ్గారెడ్డి

రచ్చబండలో పాల్గొనేందుకు ఈ నెల 13 న మెదక్ జిల్లా వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పర్యటనను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవాలని చూస్తే వారి అంతు చూస్తామని ప్రభుత్వ విఫ్ తూర్పు జయప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ఆయన నిన్న సంగారెడ్డిలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రచ్చబండకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన వారు తెలంగాణ ద్రోహులంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ లు ముఖ్యమంత్రిని తమ నియోజకవర్గాల్లో పర్యటించాలని కోరారని గుర్తు చేశారు. అప్పుడు వారు కూడా తెలంగాణ ద్రోహులేనా? అని ప్రశ్నించారు. 'తెలంగాణ టీఆర్ఎస్ జాగీరా? హరీష్ రావు అబ్బ సొత్తా? మీ భాగోతం ఎవరికి తెలియదు' అంటూ విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులను ఆహ్వానించినట్టు ఆయన తెలిపారు.

More Telugu News