: షిండేను అడ్డుకునేందుకు యత్నించిన టీడీపీ ఎంపీలు
ఢిల్లీలోని నార్త్ బ్లాక్ వద్ద కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను టీడీపీ ఎంపీలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని పార్లమెంటు ఆవరణలో ఎంపీలు నినాదాలు చేశారు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దాంతో, ఎంపీలు కొనకళ్ల, మోదుగుల, కిష్టప్ప, శివప్రసాద్ భధ్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.