: జగన్ బెయిల్ పై బహిరంగ చర్చకు సిద్ధం: కేఆర్ ఆమోస్
వైఎస్సార్ సీపీ అధినేత, ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ కు, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ స్పష్టం చేశారు. జగన్ బెయిలు పొందడం వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్న టీడీపీ నేతల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ విషయంలో టీడీపీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమని ఆమోస్ సవాలు విసిరారు.