బైకుల విక్రయాల జోరు.. కార్ల అమ్మకాల్లో నీరసం
సెప్టెంబర్ మాసంలో ఆటోమొబైల్ కంపెనీలకు భిన్న ఫలితాలొచ్చాయి. గత కొన్ని నెలలుగా ప్రతికూలత ఎదుర్కొన్న బైకుల అమ్మకాలు సెప్టెంబర్ నెలలో మాత్రం జోరందుకున్నాయి. గత నెలలో 8,85,117 మోటారు సైకిళ్లు అమ్ముడుపోయినట్లు భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం వెల్లడించింది. 2012 సెప్టెంబర్ నెలలో అమ్మడుపోయిన 7,53,693 మోటారు సైకిళ్లతో పోలిస్తే విక్రయాలు 17 శాతం పెరిగాయి. ఇక కార్ల అమ్మకాలు మాత్రం కేవలం 1 శాతం లోపే పెరిగి 1,54,884 వాహనాలుగా నమోదయ్యాయి.