చదివేది అర్థం కావడంలేదా...
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చదివేది అర్థం కావడంలేదా...

మీరు ఏదైనా విషయాన్ని చదువుతున్నా... అది అర్ధం కావడంలేదా... అయితే దీనికి పలు కారణాలను చెప్పవచ్చు. వాటిలో ఒకటి మీ శరీరంలో పొటాషియం లోపించడం. శరీరానికి తగు మోతాదులో పొటాషియం లభించని పక్షంలో మన మెదడు సక్రమంగా పనిచేయదు. మెదడులోని కొన్ని కణాలు సక్రమంగా పనిచేయాలంటే పొటాషియం అవసరం. ఇది లోపించడం వల్ల మీరు ఏం చదువుతున్నా అది మీకు సరిగ్గా అర్ధం కాకపోవడం అనేది జరుగుతుందట.

శరీరానికి అవసరమైన లవణాల్లో ముఖ్యమైనది పొటాషియం. ఇది లోపించడం వల్ల గుండె కొట్టుకోవడం అనేది సరిగ్గా జరగదు. ఎందుకంటే గుండెకు సంబంధించిన కండరాలు పొటాషియం లోపం వల్ల బిగుసుకుపోతాయి. మన శరీరంలోని కండరాలు కూడా పట్టు కోల్పోతాయి. దీంతో బలంగా మనం ఏ వస్తువును కూడా పట్టుకోలేం. ఇలాంటి లోపాలను అధిగమించాలంటే రోజూ మన ఆహారంలో తగు మోతాదులో పొటాషియం ఉండేలా చూసుకోవాలి.

ఇది ఎక్కువగా ఎలాంటి ఆహార పదార్ధాల్లో లభిస్తుంది అంటే మొదటగా చెప్పుకోవాల్సింది... పిల్లలందరికీ ఇష్టమైంది అరటిపండు. ఒక్క అరటిపండులో 400 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుందట. అలాగే బంగాళాదుంపల్లో కూడా పొటాషియం ఉంటుంది. ఒక పెద్ద బంగాళాదుంపలో 1600 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుందట. కాబట్టి మనం రోజూ తీసుకునే ఆహారంలో పొటాషియం కూడా ఉండేలా చూసుకుంటే ఈ లోపాన్ని అధిగమించవచ్చు.

More Telugu News