: ఎంఐఎంను హుస్సేన్ సాగర్లో కలిపేస్తారు: కిషన్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని హైదరాబాద్ ప్రజలు హుస్సేన్ సాగర్లో కలిపేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాదుపై స్పష్టమైన వైఖరి ప్రకటిస్తే తాము స్పందిస్తామన్నారు. ఇక, ఇటీవల కేంద్రమంత్రి జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి దీటుగా బదులిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ పోరాటం బీజేపీతో కాదని, ఆర్ఎస్ఎస్ తోనే అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కిషన్ రెడ్డి, వచ్చే ఎన్నికల్లో బీజేపీ పోరాటం సీబీఐతోనే అని పేర్కొన్నారు.