: విదేశీ ఇన్వెస్టర్ తో చర్చలు జరుపుతున్న కింగ్ ఫిషర్
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లో వాటాను విక్రయించడానికి ఒక విదేశీ సంస్థతో చర్చలు జరుపుతున్నట్టు కింగ్ ఫిషర్ చైర్మన్, లిక్కర్ డాన్ విజయ్ మాల్యా తెలిపారు. ఈ రోజు జరిగిన 'షేర్ హోల్డర్ల వార్షిక సమావేశం' అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని... అన్నీ పూర్తవడానికి మరో 90 రోజుల వరకు పడుతుందని ఆయన తెలిపారు. అయితే ఆ విదేశీ ఇన్వెస్టర్ ఎవరనే సంగతి మాల్యా బయట పెట్టలేదు. గతంలో కూడా కింగ్ ఫిషర్ లో వాటాలను విక్రయిస్తున్నట్టు మాల్యా కొన్నిసార్లు ప్రకటించారు. అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదు.