: బీజేపీ ఎమ్మెల్యేపై జాతీయ భద్రతా చట్టం కింద కేసు
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ అల్లర్ల కేసులో అరెస్టయిన బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ పై జాతీయ భద్రతా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన అల్లర్ల వ్యాప్తికి కారణమైన నకిలీ వీడియోను అప్ లోడ్ చేసినందుకు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినందుకు ఆయనపై ఈ కేసు పెట్టారు. ఈ మేరకు యూరై జిల్లా జైలులో ఉన్న సంగీత్ సోమ్ కు ఈ రోజు వారెంట్లు అందజేశారు.