: రోజంతా ఆన్ లైన్లో రైల్వే రిజర్వేషన్
ఇంటర్నెట్ ద్వారా రైల్వే టికెట్లు బుక్ చేసుకునే సమయాన్నిమంత్రి బన్సల్ పొడిగించారు. ఉదయం 00.30 గంటల (అంటే అర్ధరాత్రి) నుంచి అదే రోజు రాత్రి 11.30 గంటల వరకూ ఆన్ లైన్లో ఐఆర్ సీటీసీ సైట్ ద్వారా బుక్ చేసుకునేందుకు సౌలభ్యం కల్పించారు. రాత్రి 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ కేవలం గంటపాటు మాత్రమే ఆన్ లైన్ రిజర్వేషన్ సదుపాయం నిలిచిపోతుంది.
* అలాగే, మొబైల్ ఫోన్ల ద్వారా ఈ టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యాన్నీ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.
* రిజర్వేషన్ చేసుకున్న తర్వాత బెర్త్ కన్ఫర్మ్ అయిన వెంటనే ఆ విషయాన్ని ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేసే సౌకర్యాన్నీ ప్రారంభిస్తున్నామని చెప్పారు. మొబైల్ ద్వారా రిజర్వేషన్ సమాచారాన్నీ తెలుసుకోవచ్చని ప్రకటించారు.