Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రధాని అభ్యర్ధిపై మేం క్లియర్: రాజ్ నాథ్ సింగ్

ప్రధాని అభ్యర్ధి ఎంపికపై భారతీయ జనతా పార్టీ వైఖరి చాలా స్పష్టంగా ఉందని అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ముందు తమ అభ్యర్ధిని ప్రకటిస్తామని చెప్పారు. సిమ్లాలోని పాలమ్ పూర్ లో బీజేపీ కార్యకర్తల శిక్షణా కార్యక్రమంలో ప్రసంగించిన రాజ్ నాథ్.. ప్రధాని అభ్యర్ధి గురించి ఇప్పుడు కాంగ్రెస్ ను అడగాలని మీడియాకు సూచించారు. తమ అభ్యర్ధి ఎంపికపై చాలా క్లియర్ గా ఉన్నామని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని, వాటిపైనే దృష్టి పెట్టాలని చెప్పారు. ఇప్పటికే నరేంద్ర మోడీయే తమ అభ్యర్ధి అని రాజ్ నాథ్ సంకేతాలిస్తుండగా, రెండురోజుల కిందట మోడీకి ఆ అర్హత ఉందని యశ్వంత్ సిన్హా అన్నారు. అటు అద్వానీ కూడా మోడీని మెచ్చుకున్నారు. అంటే మోడీయే బీజేపీ ప్రధాని అభ్యర్ధి అని అధికారికంగా ప్రకటించకపోయినా స్పష్టంగా తెలుస్తోంది.

More Telugu News