కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కృష్ణాజిల్లా ఎన్జీవోలు విధుల బహిష్కరణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కృష్ణాజిల్లా ఎన్జీవోలు విధుల బహిష్కరణ

తెలంగాణ ఏర్పడగానే ఆంధ్రా ఉద్యోగులు హైదరాబాదును విడిచి వెళ్లిపోవాలంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కృష్ణాజిల్లా ఎన్జీవోలు విధులు బహిష్కరించారు. విజయవాడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ఉదయం పదకొండు గంటలకు ఎన్జీవోలు మహాధర్నా చేపడతారు. మరోవైపు హనుమాన్ జంక్షన్ లో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే దీక్షలు చేపట్టారు. అటు జగ్గయ్యపేటలో డిపో నుంచి బస్సులు కదలకుండా ఉద్యమకారులు అడ్డుకున్నారు.

More Telugu News