Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆ బహ్మాస్త్రమేదో ప్రయోగించాలి: కోడెల

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ వద్ద బహ్మాస్త్రం ఉందని పదేపదే ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఇప్పడు ఆ అస్త్రాన్ని ప్రయోగించి వెంటనే విభజన ప్రక్రియ ఆపేయాలని టీడీపీ అధికార ప్రతినిధి కోడెల శివప్రసాదరావు డిమాండ్ చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని రెండు ముక్కలుచేసి ఏడు కోట్ల మంది ప్రజలకు తీరని ఆవేదని మిగిల్చింది సోనియా గాంధీయేనని ఆరోపించారు.

More Telugu News