శ్రీవారి దర్శనం కోసం క్రికెటర్ల క్యూ
తిరుమల శ్రీనివాసుడి దర్శనం కోసం క్రికెటర్లు క్యూ కడుతున్నారు. శనివారం వేకువజామున సుప్రభాత సేవలో విఖ్యాత క్రికెటర్ సచిన్ పాల్గొని స్వామి వారి దర్శనం చేసుకుని వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ రోజు మరో క్రికెటర్ శ్రీశాంత్ కూడా స్వామిని దర్శించుకున్నాడు. ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నాడు. అనంతరం శ్రీశాంత్ కు టీటీడీ అధికార్లు తీర్ధ ప్రసాదాలు అందించారు.