: 'మూడో విడత' ముందు బాబు మాట

మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఎల్లుండి జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విపక్ష హోదాలో తాము తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుని పదో ఏట అడుగుపెట్టామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపించారు. ప్రజలకు నీరు, కనీస అవసరాలు కరవయ్యాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని పేర్కొంటూ, ముఖ్యంగా పంచాయతీలు, మున్సిపాలిటీలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కూడా నిధులు మంజూరు చేయకపోవడంతో పరిస్థితి మరీ దిగజారిందని అన్నారు.

స్వలాభాపేక్ష కోసం పిల్ల కాంగ్రెస్ (వైఎస్సార్సీపీ), ప్రజాసమస్యలు పక్కనబెట్టి టీఆర్ఎస్ వ్యర్థ రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. టీడీపీ ఒక్కటే ప్రజల పక్షాన నిలిచిందని, అందుకు కృతజ్ఞతగా పార్టీ బలపరిచిన సర్పంచి అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారని బాబు వ్యాఖ్యానించారు.

More Telugu News