: రోజుకు రూ.28 సంపాదిస్తే పేదవారు కాదట!

భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ.28 సంపాదిస్తే పేదవారు కాదని ప్రణాళిక సంఘం తాజా లెక్కల్లో పేర్కొంది. అదే, నగరాల్లో రోజుకు రూ.33 సంపాదించే వారు కూడా పేదవారి కిందకు రారని తెలిపింది. దాంతో, గతంలో సురేష్ టెండూల్కర్ కమిటీ చెప్పిన వివాదాస్పద అంశాలనే తిరిగి ఇందులోనూ ప్రస్తావించినట్టయింది. అయితే, గత ఎనిమిది సంవత్సరాల నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదరికం పెరిగిందన్న విషయాన్ని కమిషన్ తిరస్కరించింది.

దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారి సంఖ్య 2011-12 సంవత్సరాల్లో 21.9 శాతం ఉంటే, 2009-10లో ఈ సంఖ్య 29.8 శాతం, 2004-05లో 37.2 శాతం ఉందని వివరించింది. దీని ప్రకారం సంవత్సరాల వారీగా దారిద్ర్య రేఖకు దిగువ ఉండే వారి సంఖ్య తగ్గుతూ వస్తోందని వెల్లడించింది. ఈ లెక్కలను గృహ వినియోగాదారుల వ్యయం ఆధారంగా తీసుకున్నట్లు చెప్పింది.

More Telugu News