నూతన క్యాంటిన్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన విజయవాడ నగర మేయర్

  • నూతన క్యాంటిన్ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలో రూ.55 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న జీ 1 క్యాంటిన్ కమ్  రిఫ్రెష్మెంట్ భవన నిర్మాణమునకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, అధికారులు మరియు సిబ్బందితో కలసి భూమి పూజ నిర్వహంచారు. ఈ సందర్బంలో మేయర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహించు సిబ్బందికి మరియు వివిధ పనుల మీద వచ్చు ఇతర సిబ్బందికి, ప్రజలకు సరైన క్యాంటిన్ అందుబాటులో లేకపోవుటతో రూ. రూ.55 లక్షల నగరపాలక సంస్థ సాధారణ నిధులతో నూతన భవనము నిర్మాణమునకు చర్యలు తీసుకోవటం జరిగిందని, దీనిలో డైనింగ్ ఏరియా, కిచెన్ మరియు సిబ్బందికి కొరకు రిఫ్రెష్మెంట్ కమ్ డైనింగ్ హాల్ నిర్మించనున్నట్లు తెలియజేసారు. ఈ సందర్బంలో జీ.2 భవన నిర్మాణము చేపట్టుటకు గల అవకాశాలు పరిశీలించాలని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.

తదుపరి కార్యాలయంలోని నూతన భవనమును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేస్తూ, నిల్చిన నిర్మాణ పనులు సత్వరమే ప్రారంభించునట్లుగా చూడలని సంబందిత అధికారులకు సూచించారు.

కార్యక్రమములో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, అదనపు కమిషనర్ (జనరల్) యం.శ్యామల, సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్, ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరెడ్డి, ఇతర అధికారులు మరియు వి.యం.సి మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సభ్యులు  పాల్గొన్నారు. 

నగరంలో పూర్తి స్థాయిలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మకాలను నిషేధించుటలో సహకరించాలి: హోల్ సేల్ ప్లాస్టిక్ బ్యాగ్ వర్తక సంఘ ప్రతినిదులకు సమావేశం నిర్వహించిన అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి
పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ ప్లాస్టిక్ వ్యర్థాలైన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులను నిషేదించాలనే ఉత్తర్వులు మేరకు విజయవాడ నగరంలో పూర్తి స్థాయిలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదించుట జరిగిన దర్మిల శనివారం అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి ఆమె ఛాంబర్ నందు నగర పరిధిలోని హోల్ సేల్ క్యారి బ్యాగుల వ్యాపారులతో సమావేశం నిర్వహించారు.

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి మారుతున్న జీవన శైలిలో ఆరోగ్యకర వాతావరణాన్ని అందించాలి అంటే  ప్రతి ఒక్కరం  ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లు మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదించి జ్యూట్,  క్లాత్ బ్యాగులు మరియు  పేపర్ సంచులు మొదలగునవి  ప్రత్యామ్నాయముగా ఉపయోగించవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. మీరందరూ సింగల్ ప్లాస్టిక్ నిషేదించుటలో సచ్చందంగా భాగస్వాములు కావాలని పిలుపునిస్తూ, టోకు వ్యాపారాలు విధిగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శలకు అనుగుణంగా వ్యాపారాలు నిర్వహించుకోనవలసిన అవసరం ఉందని అన్నారు. నగరపాలక సంస్థ యొక్క నిబంధనలు ఉల్లగించిన వ్యాపార సంస్థలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుందని అన్నారు. అదే విధంగా వ్యాపారుల వద్ద నిల్వ ఉన్న ఉత్పత్తులను సిజ్ చేయుట జరుగునని హెచ్చరించారు.

ప్లాస్టిక్‌తో తయారు చేసిన సింగల్ యూజ్ క్యారీ బ్యాగ్‌ తో పాటుగా ఇతర నిషేధిత వస్తువుల విక్రయాలు మరియు వినియోగాన్ని నివారించాలని, ప్రధాన వాణిజ్య సంస్థలు మరియు వీధి విక్రయదారులు, కూరగాయలు & పండ్ల మార్కెట్‌లు, మాల్స్ మరియు ఇతర వాణిజ్య సంస్థల వారికీ అవగాహన కల్పించే దిశగా నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంటునట్లు ఆమె వ్యాపారులకు వివరించారు. అదే విధంగా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నియమాలపై క్షేత్రస్థాయిలో  కరపత్రాలను పంపిణీ చేయడం, ముఖ్యమైన ప్రదేశాలలో హోర్డింగ్‌లు ఏర్పాటు, సినిమా థియేటర్లలో స్లైడ్‌లను ప్రదర్శించడం, టీవీ స్క్రోలింగ్, ర్యాలీలు నిర్వహించడం మొదలైన వాటి ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. వీటితో పాటుగా వార్డ్ వాలంటీర్లు, వార్డు శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీలు, స్వయం సహాయక సంఘాల  సభ్యులు మరియు ఎన్నికైన ప్రతినిధులతో IEC ప్రచారాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

సమావేశంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్ మరియు నగర పరిధిలోని వివిధ హోల్ సేల్ వ్యాపారాలు పాల్గొన్నారు.

More Press News